ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన స్పిన్ తో ఎలాంటి బెటర్ నైనా తడబాటు చేస్తాడు. ఎంత పెద్ద బ్యాట్స్మాన్ని అయినా వికెట్ తీయగలడు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత దేశంలోనూ ఆయనకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.
మరీ ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు ఆయన సుపరిచితుడే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎన్నో ఏళ్ళు ప్రాతినిత్యం వహించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్నాడు. అతడు ఒక బౌలర్ గా మాత్రమే కాకుండా బ్యాటింగ్ లోను అదరగొడతాడు.
క్రిజ్ లోకి దిగాడంటే సిక్సర్ల వర్షం అనే చెప్పాలి. ఇలా ఆల్రౌండర్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక తాజాగా అతడు అరుదైన ఘనత సాధించాడు. టి20 లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రషీద్ ఖాన్ నిలిచాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న SA 20 లీగ్ లో ఎమ్ఐ కేప్ టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల పార్ల రాయల్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో దాదాపు రెండు వికెట్లు తీశాడు. దీంతో టి20లో (అంతర్జాతీయ+లీగ్లు) కలిసి దాదాపు 633 వికెట్లు పడగొట్టాడు.
ఇందులో ఆఫ్గాన్ తరపున 161 వికెట్లు తీశాడు మిగిలిన 472 వికెట్లు దేశవాళీ మ్యాచ్లలతో పాటు వివిధ లీగ్ లో పడగొట్టాడు. దాదాపు 461 మ్యాచ్లో 18.08 సగటుతో రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఈ ఘనతపై రషీద్ ఖాన్ తాజాగా స్పందించాడు. పదేళ్ల ముందు ఈ ఘనత సాధిస్తానని అస్సలు అనుకోలేదు అన్నాడు. టేబుల్ టాపర్ గా నిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. డ్వాన్ బ్రావో నీ అధిగమించడం చాలా గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. పలువురు అభినందనలు తెలుపుతున్నారు.