summer health tips: వేసవికాలంలో బీపీ పేషెంట్లు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేదంటే!

వేసవికాలం మొదలైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 -9 అయ్యేసరికి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే డిహైడ్రేషన్ కు గురై చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సాధారణ వ్యక్తుల కంటే వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని విషయాలు అస్సలు మర్చిపోకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా బీపీ పేషెంట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరు సమ్మర్ లో కొన్ని విషయాలు పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బిపి పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

బిపి పేషెంట్లు

సాధారణంగా కొందరికి హై బీపీ కొందరికి లో బీపీ ఉంటుంది. అందువల్ల రక్తపోటు సమస్యలు ఉన్నవారు వేసవికాలంలో కొన్ని సూచనలు తరచూ పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఇవి బీపీ పెరగకుండా బాగా సహాయ పడతాయి.

హైడ్రేషన్

బిపి పేషెంట్లు ఎక్కువగా వేసవికాలంలో నీళ్లు తాగాలి. బాడీని ఎప్పుడు హైడ్రేటుగా ఉంచుకోవాలి. ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్స్ తీసుకోవాలి. అది శరీరంలోని బీపీని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మీరు సురక్షితంగా ఉంటారు.

ఒత్తిడి

చాలామంది వేసవికాలంలో వేడి వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. స్ట్రెస్ ఎక్కువవుతుంది. కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగులోపు ఇంట్లోనే చల్లటి ఫ్యాన్ వేసుకుని ఉంటే మంచిది.

చెకప్

బిపి పేషెంట్లు తరచూ రక్తపోటు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా ట్రీట్మెంట్, మెడిసిన్స్ తీసుకోవాలి. అలాగే, జీవన శైలి అలవాట్లు మార్చుకోవాలి.

డైట్

వేసవికాలంలో వేడిని దూరం చేసి బిపి ని కంట్రోల్ చేయడంలో సహాయం చేసే ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్కువ చలవ చేసే పదార్థాలు తినాలి. దోసకాయ, పెరుగు, సెలరీ వంటే ఫుడ్స్ డైట్ లో తీసుకోవాలి. ఇవి వేడిని తగ్గించడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి

తరవాత కథనం