అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ఎట్టకేలకు ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది. భారీ ధరకు దక్కించుకున్న ఓటిటి ప్లాట్ఫారం దీనిని ఇప్పుడు రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అందులో చెప్పుకొచ్చింది. మరి ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. ఏ తేదీన స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అంతే కాకుండా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంత భావించారు.
దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మాత అనిల్ సుంకర నిర్మించాడు. మంచి హిట్ అవుతుందని అతడు కూడా భావించాడు. కానీ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసేసింది. థియేటర్లలో రిలీజ్ అయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షో నుంచి ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది.
ఈ దెబ్బకు అఖిల్ మరొక సినిమా చేయలేదు. దాదాపు రెండేళ్లు గడుస్తున్నా అఖిల్ కొత్త సినిమా ఉసే లేదు. అప్పట్నుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కనిపించడం మానేశాడు. ఈ దెబ్బతో నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఏదైనా సినిమా థియేటర్లలో ఆడకపోతే కొద్ది రోజులకే ఓటిటి లోకి వచ్చేస్తుంది.
కానీ ఏజెంట్ మూవీ మాత్రం రిలీజ్ అయ్యి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఓటిటికి రాలేదు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లీవ్ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రాన్ని గత ఏడాది స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది కానీ ఆడియన్స్ ముందుకు రాలేదు.
మళ్లీ ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు ఆ సంస్థ అఫీషియల్ గా మరోసారి అనౌన్స్ చేసింది. ఈ మూవీ మార్చి 14 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. చూడాలి మరి ఇప్పుడు ఈ సినిమాని ఓ టి టీ ఆడియన్స్ ఆదరిస్తారో లేదో.