Natural Hair Serum: జుట్టు సమస్యలు ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. దాదాపు చాలా మంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. కొందరికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. మరి కొందరికి వెంట్రుకలప పొడిబారి చిట్లిపోయి ఉంటాయి. ఇక పొడవాటి జుట్టు అయితే ఈ రోజుల్లో చాలా మందికి కలగానే మారిపోయింది.
బయట మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ జుట్టు పరిస్థితి మెరుగుపడటం లేదు. మీకు కూడా ఇలానే జుట్టు రాలిపోతుందా.. ఎంత ప్రయత్నించిన వెంట్రుకలు పెరగడం లేదా. అయితే ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయ తొక్కలు
కరివేపాకు
మెంతులు
బ్లాక్ సీడ్స్
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఉల్లిపాయ తొక్కలు, కరివేపాకు, మెంతులు, బ్లాక్ సీడ్స్, గ్లాసు వాటర్ పోసి 20 నిమిషాల వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోండి. ఈ సీరమ్‌ను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి.
లేదా రాత్రి పడుకునే ముందు జుట్టుకు పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఉల్లిపాయ తొక్కలు, మెంతులు, కరివేపాకు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలు వీటిలో పుష్కలంగా దొరుకుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెల్లజుట్టు సమస్యలతో బాధపడేవాళ్లు ఒక్కసారి ఈ హెయిర్ సీరమ్ వాడండి.. అద్భుతంగా పనిచేస్తుంది.