Kannappa Vs Bhairavam: మరోసారి మంచు బ్రదర్స్ పోటీ.. కన్నప్ప Vs భైరవం.. ఒకేరోజు ఢీ!

మంచు ఫ్యామిలీలో ఇటీవల భారి స్థాయిలో గొడవలు జరిగాయి. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ నడిచింది. నువ్వా నేనా అన్నట్లుగా వీరి ఎపిసోడ్ కొన్ని వారాలుగా సాగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంతవరకు మేటర్ వెళ్ళింది. ఇక ఇప్పుడిప్పుడే వీరి వ్యవహారం సైలెంట్ అయింది అని అంతా అనుకున్నారు.

కానీ మళ్ళీ విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఫ్యామిలీ గొడవలతో తలపడ్డ అన్నదమ్ములు ఇప్పుడు సినిమాలతో పోటీపడేందుకు సిద్ధమయ్యారు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప, అలాగే మంచు మనోజ్ నటిస్తున్న భైరవం మూవీ ఒకేరోజు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ మూవీ దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు వంటి స్టార్ అండ్ సీనియర్ నటులు భాగం కావడంతో సినిమాపై అంచనాలు రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ కు భలే రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రమోషన్లలో బిజీగా ఉంది.

మంచు విష్ణు పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ దూసుకుపోతున్నాడు. మరోవైపు మంచు మనోజ్ నటిస్తున్న కొత్త చిత్రం భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పుడు ఒక డేట్ ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కన్నప్ప విడుదల రోజునే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అంటే ఏప్రిల్ 25వ తేదీన మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మరోసారి అన్న వర్సెస్ తమ్ముడు అన్నట్లు ఉంటుంది.

తరవాత కథనం