Prabhas: ప్రభాస్ ‘స్పిరిట్’ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఇక రచ్చ రచ్చే!

టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీ ఒకటి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని తహతహలాడుతున్నారు. యానిమల్ మూవీతో సరికొత్త యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న సందీప్.. ఇప్పుడు అలాంటి యాక్షన్ తోనే ప్రభాస్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రకటించి ఎన్నో నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని ఎదురుచూసే అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి వార్త వైరల్ గా మారింది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా స్క్రిప్టు పనులు దాదాపు కంప్లీట్ చేశాడని తెలిసింది. దీంతో త్వరలోనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా ప్రారంభించేందుకు ఏర్పాటులు జరుగుతున్నాయని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.

పండుగ రోజు అయితే అన్ని విధాలుగా బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే రెగ్యులర్ షూటింగ్ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఈ ఏడాది చివరి నుంచి స్పిరిట్ మూవీని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా ఈ మూవీతో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చూడాలి మరి సందీప్ రెడ్డి వంగ ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడో.

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలను చేస్తున్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు.

కానీ ఇప్పుడు అది వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లేద అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ చేస్తున్నాడు.

తరవాత కథనం