Pomegranates Juice: దానిమ్మ పండు చాలా రుచిగా ఉంటుంది కదా.. ఆరోగ్యకరమైన పండ్లలో ఇది కూడా ఒకటి. గింజలు సంమృద్దిగా ఉండే దానిమ్మలో మన శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. దానిమ్మలో అనేక అనారోగ్యాలతో కణాలతో పోరాడే విశేష గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలపై వెంటిలేషన్‌గా పనిచేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో ఉండే పోషకాలు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో కణాలకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని నివారించే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. దానిమ్మ పండులో ఫ్రీ రాడికల్స్‌ను కలిగే నష్టాలను తగ్గించే యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువ స్థాయిలో దానిమ్మలో ఉంటాయి. మెదడు శక్తిని హరించే అల్జీమర్స్ వ్యాధిని నివారించే గుణాలు దానిమ్మలో పుష్కలంగా లభిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో ఆక్సీజన్ స్థాయి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గర్భవతులు దానిమ్మ పండును తీసుకున్నప్పుడు.. పుట్టబోయే బిడ్డ మెదడు సైతం మేలు చేస్తుందట. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్ధరైటిస్‌తో బాధపడుతున్న వాళ్లు దానిమ్మ పండును ఎక్కువగా తీసుకోవడం వల్లన ఎముకలను కాపాడే మృదులాస్థి క్షీణించకుండా ఉంటుంది.
దానిమ్మతో గుండె ఈరోగ్యం మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని అడ్డుగా మారకుండా దానిమ్మ పండులోని పోషకాలు నివారిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దానిమ్మ పండు జ్యూస్ తాగడం వల్లన రక్తపోటు తగ్గుతుందని అధ్యయానాల్లో తేలింది. దానిమ్మ పండు కిడ్నీలో రాళ్లను తగ్గంచడంలో సహాయపడుతుంది.
దానిమ్మ జ్యూస్‌లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది. దానిమ్మ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. 100 గ్రాముల విత్తనాలలో 83 కేలరీలు ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మ జ్యూస్ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.