simple facial tips: పార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మిలమిల మెరిసే అందం.. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే చాలు!

చాలామంది తమ ముఖ సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకోవడానికి ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొందరు ఆ ఖర్చుకు భయపడి అటువైపు చూడడమే లేదు. మీరు కూడా అలాంటి వారే అయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి మీ ఫేస్ ను మరింత మృదువుగా, అందంగా చేసుకోవచ్చు.

ఇంటి వద్దనే స్టీమ్ ఫేషియల్ ట్రై చేసి అందాన్ని పెంచుకోవచ్చు. దీనికోసం తులసి ఆకులు, వేపాకులు, గ్రీన్ టీ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటి ద్వారా మీరు మీ స్కిన్ ను మెరుగుపరుచుకోవచ్చు. స్టీమ్ ఫేషియల్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ న్ను మెరుగుపరుస్తుంది.

లాభాలు

గ్రీన్ టీ బ్యాగ్ లోని అవశేషాలు, తులసి ఆకులు, అలాగే వేపాకులు వంటి వాటిని మెత్తగా పేస్టులా చేసి ఫేషియల్ చేసుకోవాలి. వీటివల్ల చర్మ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

స్కిన్ లైటనింగ్

ఈ ఫేషియల్ ముఖానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాని ద్వారా స్కిన్ నేచురల్ గానే గ్లో అవుతుంది. ఆవిరి చర్మం లోపలికి చేరిన తర్వాత చర్మం రిఫ్రెష్ గా తయారవుతుంది. దీని కారణంగా స్కిన్ మిలమిల మెరిసిపోతుంది.

మొటిమలకు చెక్

ఆవిరి ఫేషియల్ ఎక్కువగా మొటిమలు, నల్లటి మచ్చలు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లోనే మిగతా అవశేషాలు, తులసి ఆకులు, వేపాకులు వంటి మూడు పదార్థాలు కలిపి ముఖానికి రాయడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. దీని ద్వారా నల్లటి మచ్చలు, మొటిమలకు చెక్ పడుతుంది.

మాయిశ్చరైజింగ్

ఇది చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది. స్కిన్ డ్రై అవ్వడం, దురద వంటి సమస్యల నుండి ఉపశమనం కల్పిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అదే సమయంలో ముడతలను తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

ముఖానికి ఫేషియల్ చేసుకున్న సమయంలో ఆవిరి పట్టడం ద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ టైంలో ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఆవిరి పట్టడం వల్ల శరీరం, మనసుకు ఉపశమనం లభిస్తుంది.

తరవాత కథనం