Thug Life Ott Rights: కెవ్ కేక.. కోట్ల ధరకు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ ఓటీటీ రైట్స్

తమిళ స్టార్ విలక్షణ యాక్టర్ కమల్ హాసన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. విక్రమ్ వంటి సినిమాతో కంబ్యాక్ అయిన కమల్.. భారతీయుడు 2 సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. అంతకుముందు ప్రభాస్ కల్కి మూవీలో విలన్ గా నటించి అదరగొట్టేసాడు. ఇప్పుడు కమలహాసన్ ఒక కొత్త మూవీ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హీరో, దర్శకుడు స్టార్లు కావడంతో హైప్ ఓ రేంజ్ లో ఉంది. అంతేకాకుండా ఇందులో తమిళ స్టార్ హీరో సింబు, స్టార్ సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటిటి రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటిటి హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎవరు ఊహించని విధంగా దాదాపు 149.7 కోట్ల రూపాయల ధరకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

దీన్ని బట్టి చూస్తే కమలహాసన్ థగ్ లైఫ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఈ మూవీ ఆడియో రైట్స్ ను సరిగమ భారీ ధరకు కొనుక్కుంది. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో హోమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ తో ఏపీ ఇంటర్నేషనల్.. అలాగే తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ కలిసి సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ భారీ రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

తరవాత కథనం