Wines Close: మందు బాబులకు బిగ్ షాక్.. మూడు రోజులు వైన్స్ బంద్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా మూడు రోజులు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాకుండా కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 21 అంటే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి 23వ తేదీ అంటే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

దానికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ 23న స్థానిక సంస్థల ఎలక్షన్ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. ఒకవేళ తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. ఈ మూడు రోజులు వైన్ షాపులు ఎవరైతే ఓపెన్ చేస్తారో వారి లైసెన్స్ రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా పరిమితికి మించి స్టాక్ ఉంచి వేరే ప్రదేశంలో అమ్మిన నేరంగానే పరిగణిస్తామని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని చెప్పారు. ఇది ఎలా ఉంటే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

బిజెపి తరఫున ఎన్ గౌతమ్ రావు బరిలోకి దిగారు. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండను మజిలీస్ పార్టీ అనౌన్స్ చేసింది. వీరిద్దరితోపాటు మరో ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈనెల 23న ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండగా.. 25వ తేదీన కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్స్ వెల్లడించనున్నారు.

తరవాత కథనం