jammu kashmir: ఆర్మీ దుస్తుల్లో వచ్చి టూరిస్టులపై ఉగ్రదాడి.. 28 మంది మృతి!

జమ్మూ కాశ్మీర్లో దారుణం జరిగింది. పహల్గాం లోని బైసరన్ లో ఉగ్రదాడి జరిగింది. మినీ స్విట్జర్లాండ్ గా పిలవబడే పహాల్గంలోని పర్యాటక ప్రదేశంలో పర్యటకులపై ఉగ్రవాదులు హింసకాండ సృష్టించారు. ఫలానా మతాన్ని అవలంబించలేదని కారణంతో దాదాపు 28 మంది అమాయకులను హతమార్చారు. ఇక బైసరన్ కాల్పుల శబ్దం వినిపించగానే భద్రత బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

అనంతరం ఆ ప్రాంతానికి అదనపు సెక్యూరిటీ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో గాయపడిన వారిని సమీప హాస్పిటల్కు తరలించారు. కొందరిని హెలికాప్టర్లో, మరికొందరిని గుర్రాలపై తీసుకువెళ్లారు. ఉగ్రవాదులు స్థానిక ఆర్మీ డ్రెెస్సులు, ఫేస్ మాస్కులు ధరించి తమ వద్దకు వచ్చారని సాక్షులు చెబుతున్నారు.

మొదటగా టూరిస్ట్ ల పేర్లు, ఆ తర్వాత మతం అడిగారని.. అలా కల్మ చదవమన్నారని చెప్పారు. కల్మ చదవని వారిని.. సంకోషించిన వారిని అక్కడికక్కడ కాల్చి చంపారని తెలిపారు. ముఖ్యంగా హిందూ పురుషులనే ఉగ్రవాదుల టార్గెట్ చేశారని సాక్షులు చెప్పుకొచ్చారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉండగా మరో ఇద్దరు స్థానికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేరకు మృతులకు సంతాపం తెలిపారు. ఈ దాడి అనంతరం ఇవాళ జమ్మూ బందుకు సంఘాలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, జమ్ము చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రాష్ట్రీయ బజరంగ్ దళ్ జమ్మూ కాశ్మీర్ యూనిట్, జమ్మూ బార్ అసోసియేషన్, విశ్వహిందూ పరిషత్ వంటి సంఘాలు ఇవాళ జమ్మూ బందుకు పిలుపునిచ్చాయి.

తరవాత కథనం