RR Vs GT: 14 ఏళ్ల వైభవ్ విధ్వంసం.. గుజరాత్‌పై రాజస్థాన్‌ ఘనవిజయం

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవన్షి అదరగొట్టేసాడు. సీనియర్, ఎక్స్పీరియన్స్ బౌలర్లను ఉత్తికారేశాడు. ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్ ఎలాంటి వారైనా ఊరుకోలేదు. భారీ లక్ష్యాన్ని సులువు చేసి రాజస్థాన్ రాయల్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ తన పేరిట నమోదు చేశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. 50 బంతుల్లో 84 పరుగులు రాబట్టి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు, బట్లర్ 50 పరుగులతో దుమ్ము దులిపేశారు.

ఈ లక్ష్య చేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ లు జైస్వాల్, వైభవ్ అదరగొట్టేశారు. ఇద్దరూ ఫోర్లు సిక్సర్లతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. దీంతో 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి రాజస్థాన్ జట్టు లక్ష్యాన్ని చేదించింది. జైస్వాల్ 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వైభవ్ 101 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

తరవాత కథనం