beautiful places in hyd: వేసవి సెలవుల్లో హైదరాబాద్‌లో చూడాల్సిన అందమైన ప్రదేశాలు.. అస్సలు మిస్ అవ్వకండి!

సమ్మర్ హాలిడేస్ లో చాలామంది ఎంజాయ్ చేసేందుకు మంచి మంచి ప్రదేశాలకు వెళుతుంటారు. మరి మీరు కూడా అలాంటి ప్లాన్ వేస్తుంటే హైదరాబాదులో చూడవలసిన చాలా ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ సందర్శనీయ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందువల్ల ఏ ఏ ప్రాంతాలకు వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అనంతగిరి హిల్స్

హైదరాబాదుకు దగ్గరగా ఉన్న అందమైన కొండ ప్రాంతం అనంతగిరి హిల్స్. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది చక్కటి ప్రదేశం.

చార్మినార్

హైదరాబాదులో అత్యంత అందమైన, సందర్శనీయమైన ప్రదేశం చార్మినార్. హైదరాబాద్ కి ఇది చిహ్నం లాంటిది. ఇక్కడ ఫ్యాషన్, బ్యాంగిల్, సహా మరెన్నో వస్తువులు అతి తక్కువ ధరకే లభిస్తాయి. అంతేకాకుండా పాతకాలపు నిజాముల నిర్మాణ శైలిని గుర్తు చేసేలా ఈ ప్రాంతం ఉంటుంది.

సాలార్జంగ్ మ్యూజియం

హైదరాబాదులో ఈ సాలార్జంగ్ మ్యూజియంకు మంచి పేరు ఉంది. ఇందులో నిజాంల వస్తువులు చాలా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన కళా వస్తువులు ఇక్కడ ఉంటాయి.

ఓషన్ పార్క్

హైదరాబాదులో ఉన్న ఓషన్ పార్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వేవ్ పుల్, ఆక్వా స్నేక్, జాక్ జూమ్ వంటి ఎన్నో ఆసక్తి బరితమైన రైడ్స్ ఉంటాయి. పిల్లలకు ఇది మంచి ప్రదేశం.

గోల్కొండ కోట

హైదరాబాద్ కు వెళ్లినవారు కచ్చితంగా గోల్కొండ కోటను చూడాల్సిందే. దీనిని ఒక పెద్ద కొండపై నిర్మించారు. 1143వ సంవత్సరంలో దీనిని నిర్మించినట్లు చాలా మంది చెబుతారు.

రామోజీ ఫిలిం సిటీ

వేసవి సెలవుల్లో రామోజీ ఫిలిం సిటీ మంచి ప్రదేశం. ఇక్కడ అనేక ఈవెంట్లను నిర్వహిస్తారు. దాదాపు 45 రోజులు పాటు ఇక్కడ హాలిడే కార్నివాల్ అనే ఈవెంట్ జరుగుతుంది. అనేక రకాల టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

బిర్లా ప్లానిటోరియం

హైదరాబాదులో ఖగోళ అద్భుతాల మ్యూజియం బిర్లా ప్లానిటోరియం. ఇది హుస్సేన్ సాగర్ దగ్గరలో ఉంటుంది. ఇందులో డైనోసార్ ఆకారంలో వాటి ఎముకలను ఉంచుతారు. అలాగే డైనోసార్ గుడ్లు కూడా ప్రదర్శనలో ఉంటాయి.

చౌహ మల్ల ప్యాలస్

చౌహ మల్ల ప్యాలెస్ నిజాం పాలకుల అధికారిక నివాసంగా ఉండేది. ఇది ఎంతో అందమైన అద్భుతమైన కట్టడం. దీనిని చూడాలంటే రెండు కళ్ళు చాలవు.

వీటితో పాటు తెలంగాణ సెక్రటేరియట్, హుస్సెన్ సాగర్ వంటివి ఉన్నాయి.

తరవాత కథనం