sharwanand bhogi : శర్వానంద్ ‘భోగీ’ ఫస్ట్ స్పార్క్ రిలీజ్.. ఈసారి తగ్గేదే లే

శర్వానంద్ మంచి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఏ ఒక్కటీ అతడికి మంచి కం బ్యాక్ ఇవ్వడం లేదు. కానీ శర్వానంద్ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఇందులో భాగంగానే గతంలో మనమే అనే సినిమా తీశాడు. అది బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.

దీంతో ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఓదెల మూవీ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో ” శర్వా 38″ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ను అఫీషియల్ ప్రకటించారు. ఈ చిత్రానికి ” భోగి” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇందులో భాగంగా భోగి స్పార్క్ అంటూ చిన్న టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వీడియో అత్యద్భుతంగా ఉంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. వీడియో బట్టి ఇది ఒక పీరియాడిక్ మిస్టరీ థ్రిల్లింగ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 1960 కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు.

ఇందులో శర్వానంద్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధ మోహన్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లు గా నటిస్తున్నారు. దీనికి బీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.

తరవాత కథనం