టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. హైదరాబాదులోనీ SR నగర్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు దాఖలు అయింది. కిషన్ లాల్ చౌహన్ అనే లాయర్ విజయ్ దేవరకొండ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సూర్య నటించిన రెట్రో సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఆదివాసి సముదాయాన్ని అవమానించినట్లు లాయర్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదును SR నగర్ పోలీసులు పరిశీలిస్తున్నారు.
రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చదువు ప్రాధాన్యతను వివరించాడు. అదే సమయంలో పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ” టెర్రరిస్ట్ కొడుకులకు సరైన చదువు ఇప్పిస్తే ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉండేవారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు ఇలా బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు” అని ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పైనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
వీటిపై లాయర్ కిషన్ లాల్ చౌహన్ ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది. ఈ మేరకు విజయ్ దేవరకొండపై ఫిర్యాదులో.. రెట్రో సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఆదివాసి సముదాయాన్ని అవమానించేలా మాట్లాడాడని పేర్కొన్నాడు.
అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు ఆదివాసి సంస్కృతి, జీవన విధానాన్ని అత్యంత కించ పరిచేలా చిత్రీకరించాయని అన్నారు. ఇప్పుడు ఇది ఆ సముదాయంలో ఆగ్రహానికి కారణమైందని ఆయన ఆరోపించారు. SR నగర్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ ప్రారంభించారు. ఈ ఆరోపణలకు సంబంధించి విజయ్ దేవరకొండ లేదా ఆయన టీం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక రెస్పాన్స్ రాలేదు.