cm chandrababu: అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం – సీఎం చంద్రబాబు

అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం శుక్రవారం అత్యంత గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. దీనికోసం పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

అమరావతి పూర్తయిన తర్వాత మోడీని మళ్లీ ఇక్కడికి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. దాదాపు 57,980 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ గైడెన్స్ తోనే అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి రాజధాని అనేది ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని.. దాదాపు 5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఎన్నో విధాలుగా తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్బుగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా పర్యావరణహితంగా తయారు చేస్తామని.. టాటా ఇన్నోవేషన్, బిట్స్ పిలాని హబ్ లాంటి సంస్థలు సైతం అమరావతికి వస్తాయని ఆయన ఆకాంక్షించారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆసరాతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. అదే సమయంలో అమరావతి రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 34 వేల ఎకరాల భూమిని అమరావతి రైతులు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారని అన్నారు. అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని తాను మర్చిపోలేనని తెలిపారు. ఈ మేరకు రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం