కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల నటించిన రెట్రో మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయింది. మాస్ రెస్పాన్స్ తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినీ ప్రియులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. దీంతో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. సూర్య ఖాతాలో మరో ప్లాప్ పడిందని చెప్పాలి.
ఇక ఇప్పుడు సూర్య ఈసారి ఎలా అయినా ఒక మంచి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయడానికి సిద్ధమయ్యాడు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన వెంకీ.. ఇటీవల తమిళ హీరో ధనుస్ తో సార్ మూవీ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.
అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస హిట్టులతో దూసుకుపోతున్న వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలిసింది. దీంతో సూర్య అండ్ వెంకీ కాంబో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ బడ్జెట్‌లో దాదాపు 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సూర్య తీసుకోబోతున్నట్లు తెలిసింది.