మహిళలు గర్భవతిగా ఉన్నపుడు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ ఆ సమయంలో ఫుడ్ పై కేర్ తీసుకోకపోతే అది ఆమె ఆరోగ్యంపైనే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశువుపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భదారణ సమయంలో చేపల వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల విషయంలో కేర్ తీసుకోవాలి. చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి, ప్రోటీన్లకు మంచి మూలంగా పరిగణించబడతాయి. ఇది సాధారణంగా శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ గర్భధారణ సమయంలో చేపలు తినడం అంత మంచిది కాదు.
ఆ సమయంలో శరీర సున్నితత్వం పెరుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ కొంచెం నెమ్మదిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలో కూడా కొన్ని మార్పులకు లోనవుతుంది. అందువల్ల గర్భధారణ సమయంలో పోషకాహారాన్ని తీసుకోవడం ముఖ్యమే.. కానీ త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం ఇంకా ముఖ్యం. గర్భధారణ సమయంలో చేపలు తినడం వల్ల శరీరానికి అనేక రకాల హాని కలుగుతుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో చేపలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
మెర్క్యురీ టాక్సిసిటీ
మెర్క్యురీ అనేది న్యూరోటాక్సిన్. ఇది పిండం మెదడు అభివృద్ధికి హాని కలిగిస్తుంది. జర్నల్ ఆఫ్ మిడ్‌వైఫరీ & ఉమెన్స్ హెల్త్‌లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో చేపలు తినడం వల్ల పిండం అభివృద్ధికి అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. కానీ చేపలను తినడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెద్ద చేపలు, దీర్ఘకాలం జీవించే చేపలలో అధిక మొత్తంలో పాదరసం ఉంటుంది. గర్భధారణ సమయంలో వాటిని తినడం వల్ల పిండం మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.
ఇన్ఫెక్షన్ ప్రమాదం
పచ్చి లేదా తక్కువగా ఉడికించిన చేపలలో లిస్టేరియా, ఇతర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వీటిని తినడం వల్ల గర్భిణీ స్త్రీల పిండాలకు ప్రమాదకరం. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన చేపలలో లిస్టేరియా, టాక్సోప్లాస్మా వంటి బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉండవచ్చు. ఇది ఎరిథ్రోపోయిటిన్ అనే ఇన్ఫెక్షన్‌కి కారణం అయి.. గర్భస్రావం, అకాల ప్రసవం లేదా నవజాత శిశువు మరణించే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ బాగా ఉడికించిన చేపలను తినాలి.
జీర్ణ అసౌకర్యం
గర్భధారణ సమయంలో మహిళల జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. ఎక్కువ చేపలు లేదా తక్కువ నాణ్యత గల చేపలను తినడం వల్ల అజీర్ణం, ఆమ్లత్వం, వాంతులు లేదా కడుపు నొప్పి వస్తుంది. దీని వలన శరీరంలో నీరు, పోషకాలు లేకపోవడం జరుగుతుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ హానికరం.
చేపలు తల్లి, బిడ్డకు ప్రయోజనకరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి. కానీ గర్భధారణ సమయంలో చేపలు లేదా అధిక మాంసం తినడం మానుకోవాలి.