Megastar Chiranjeevi: ఇద్దరి భామలతో ముద్దుల మెగాస్టార్.. అనిల్ రావిపూడి ప్లాన్ అదుర్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. ఫాంటసీ యాక్షన్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంఛనాలను పెంచేసింది.

ముఖ్యంగా ఈ మూవీలో గ్రాఫిక్స్ హైలెట్ గా ఉందని చెప్పాలి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చిరు మరొక కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ ఏడాది “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా ప్రారంభమైంది.

పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవి కలిసి సినిమా చేస్తుండడంతో బజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అంత ఎదురు చూస్తున్నారు.

వారి చూపులకు తాజాగా తెరపడింది. మే 22వ తేదీ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అయింది. అయితే ఈ మూవీలో హీరోయిన్లపై గత కొద్దిరోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో చిరు సరసన ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించాయి. ఫైనల్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకు అవకాశం లభించింది.

ఇందులో చిరు సరసన నయనతార నటించనుంది. అయితే నయనతారతో పాటు మరొక హీరోయిన్ కూడా ఇందులో బాగం అయినట్లు తెలుస్తోంది. సరైనోడు మూవీ లో ఎమ్మెల్యే పాత్రలో నటించి అలరించిన కేథరిన్ తెరిస్సా ఇప్పుడు చిరు మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ఆమె ఫుల్ లెన్త్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. దీంతో చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారని అర్థమవుతుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసి రోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తరవాత కథనం