Jack OTT: ఓటీటీలోకి ‘జాక్’ వచ్చేస్తున్నాడు.. అఫీషియల్ డేట్ కన్ఫర్మ్

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన కొత్త చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పటికే టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఉన్న సిద్దు జొన్నలగడ్డ, బేబీ మూవీ తో ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య కలిసి ఈ సినిమా చేయడంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ ఏర్పడింది.

వరుసగా అప్డేట్లతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ మొదటి షో నుంచే ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. డిజాస్టర్ టాక్ అందుకుని అందర్నీ నిరాశపరిచింది.

స్పై యాక్షన్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించడంలో విఫలమైంది. మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్ కూడా రాబట్లేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటిలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది.

దీంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే 8వ తేదీన ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటిటి వేదికగా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

తరవాత కథనం