SRH Vs DC: హైదరాబాద్‌ ఆశలపై నీళ్లు.. ప్లేఆఫ్స్‌కు దూరమైన సన్‌రైజర్స్‌

ఐపీఎల్ 2025 లో భాగంగా సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మొదట బౌలింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు కళ్ళు చెదిరే ప్రదర్శన చేసింది. అద్భుతమైన బౌలింగ్.. అద్వితీయమైన ఫీల్డింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ను కకావికలం చేసింది. కేవలం 134 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను కట్టడి చేసింది.

దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ అనుకోని అతిధిలా వచ్చిన వరునుడు సన్రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. గంటకు పైగా స్టేడియంలో దుమ్ము దులిపేశాడు. భారీ వర్షంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి చిత్తడిగా మారిపోయింది. దీంతో మ్యాచ్ రద్దయింది. దీని ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్లే ఆప్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

ఇక ఈ మ్యాచ్లో ఓటమి ఖాయం అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒక పాయింట్ తో గట్టు ఎక్కి హమ్మయ్య అనుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో స్టబ్స్ 36 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అషుతోష్ శర్మ 26 బంతుల్లో 41 పరుగులు రాబట్టాడు. మిగతా వారంతా తక్కువ పరుగులకే చేతులెత్తేసారు.

కరుణ్ నాయక్ 0 పరుగులు, డూప్లెసిస్ 3 పరుగులు, అభిషేక్ పోరెల్ 8 పరుగులు, కేఎల్ రాహుల్ 10 పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెల్లరేగిపోయాడు. 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఉనద్కత్ 1 వికెట్, హర్షల్ పటేల్ 1 వికెట్, ఇషాన్ మలింగ 1 వికెట్ తో విజృంభించారు.

తరవాత కథనం