జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాo లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి మట్టు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలు అధికంగా ఉండటంతో భారత ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది.
పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో ఉద్రిక్తతలు భారీ స్థాయిలో పెరిగాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే స్కూల్స్ మూసివేయాలని ఆదేశించింది. అది మాత్రమే కాకుండా పరీక్షలు కూడా వాయిదా వేసింది. పంజాబ్ లోనీ ఫిరోజ్పూర్, పఠాన్ కోట్, అమృత్సర్, ఫాజిల్కా, గురుదాస్పూర్ లలో అన్ని స్కూల్స్ మూతపడ్డాయి.
దాదాపు రెండు మూడు రోజులు పాటు ఈ స్కూల్స్ మూసి ఉంటాయి. వీటితోపాటు పంజాబ్ ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ ఈమెరకు కీలక నిర్ణయం తీసుకుంది. మే 8వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది.
ఈ మేరకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 12 నుండి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల తరలింపు దృష్ట్యా.. చారిత్రాత్మక గురుద్వారాలు తెరిచి ఉంచారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అక్కడ ప్రజలకు వసతి, లంగర్ ఏర్పాటు చేసింది.