rohit sharma retirement: టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. నెక్స్ట్ కెప్టెన్ ఎవరంటే?

భారత క్రికెట్ ఫ్యాన్స్ కు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ బిగ్ షాక్ ఇచ్చాడు. అతడు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరూ ఐపీఎల్ లో మునిగి ఉన్న సమయంలో రోహిత్ శర్మ ప్రకటన అందరిలోనూ ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

ఆ సిరీస్‌కు రోహిత్ ను సారధిగా తప్పించడానికి సెలక్టర్లు నిర్ణయించారని.. దానికోసం బీసీసీఐ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వార్తలు జోరుగా సాగాయి. అలా వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. ఈ మేరకు రోహిత్ శర్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు.

తాను టెస్టర్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని అందరితో పంచుకుంటున్నానని.. తెలుపు దుస్తుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని అన్నాడు. అంతేకాకుండా ఇన్నేళ్లుగా తనకు ప్రేమను, మద్దతును అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపాడు. ఇకపై వన్డేల్లో భారత్ కు ప్రాతినిధ్యం కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.

దీంతో ఫ్యాన్స్ ఒకెంత నిరాశకు గురవుతున్నారు. కాగా రోహిత్ శర్మ 2013లో వెస్టిండీస్ తో టెస్ట్ క్రికెట్కు ఎంట్రీ ఇచ్చాడు. 12 ఏళ్ల కెరీర్లో అతడు 67 టెస్ట్ లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు.. 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ తన కెరీర్లో అత్యధిక స్కోర్ 2019లో దక్షిణాఫ్రికాతో సాధించాడు.

దాదాపు 212 పరుగులు చేశాడు. ఇక తన చివరి టెస్టును రోహిత్ గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఇక టెస్ట్ ఫార్మేట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న అందులోనూ తలెత్తింది. అందుతున్న సమాచారం ప్రకారం.. జస్ప్రీత్ బూమ్రా, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో బూమ్రా టెస్ట్ ఫార్మేట్ కు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం