OG UPDATE: ‘ఓజీ’ షూటింగ్‌లో పవన్!.. పూర్తి చేద్దామంటూ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను వరుసగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ లైన్ అప్ లో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇందులో ఓజి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కు రెస్పాన్స్ రేంజ్ లో వచ్చింది. ముఖ్యంగా తమన్ అందించిన సాంగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక టీజర్ లో పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది అని చెప్పాలి.

అది చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే వీరి పాత్రలను మేకర్స్ రిలీజ్ చేశారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్ పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు సినిమా సెట్ లో దిగిన ఫోటోను షేర్ చేశారు. దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు.

మళ్లీ మొదలైంది.. ఈసారి కంప్లీట్ చేద్దాం అంటూ రాసుకు వచ్చారు. ఇదిలా ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ తాజా షూటింగ్లో పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది. మే 14 లేదా 15వ తేదీలో పవన్ కళ్యాణ్ ఓజి సెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సినీవర్గాలు సమాచారం. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.

తరవాత కథనం