మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ పెద్ద ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పై అదిరిపోయే డాక్యుమెంటరీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఓ డాక్యుమెంటరీనీ రెడీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎదిగిన తీరుపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మగధీరతో తన కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్.. ఆర్ ఆర్ ఆర్ తో ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఈ తరుణంలో రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తీసేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన పనులు కూడా మొదలెట్టినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలో రాంచరణ్ ఇంటి వద్ద అభిమానుల సందడిని చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం చరణ్ పెద్ది మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ పెద్ది మూవీ తెరవెనుక సీన్లను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్ అభిమానుల ఆనందానికి అవదులే ఉండవని చెప్పాలి. ఇకపోతే రీసెంట్ గా రాంచరణ్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సడ్స్ లో ప్రతిష్టించారు. ఇది కూడా మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ ను ఇచ్చింది.
ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేయగా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది.