మే నెల పోయి.. జూన్ నెల వచ్చేసింది. ఈ నెలలో టాలీవుడ్‌లో సందడే సందడి. జూన్ మొత్తం అగ్రహీరోలదే హవా కొనసాగనుంది. ఏకంగా నలుగురి బడా హీరోల చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. బాక్సాఫీసును షేక్ చేసేందుకు పవన్ కల్యాణ్, కమల్ హాసన్, ధనుష్, మంచు విష్ణు కాచుకు కూర్చున్నారు. వారం గ్యాప్‌లో వీరి సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఒక పండుగ వాతావరణం కనిపించడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.
థగ్ లైఫ్
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రం జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో త్రిష, శింబు, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ వంటి స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
హరిహర వీరమల్లు
పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కోసం అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు.
కుబేర
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ స్టార్ నాగార్జున కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మళ్లీ దర్శకునిగా అలరించబోతున్నాడు. ఇందులో రష్మక మందన్న హీరోయిన్‌గా భాగమైంది. డబ్బు చుట్టూ తిరిగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అండ్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్20న రిలీజ్ కానుంది.
కన్నప్ప
మరో పాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఇది రూపొందింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో ప్రేక్షుకుల ముందుకు వస్తున్న ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో బడా హీరోలు నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ సహా మరెందరో భాగమయ్యారు.