Actor S Srinivasan: రూ.5 కోట్ల భారీ మోసం.. కోలీవుడ్ ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు

ఎస్. శ్రీనివాసన్ తమిళనాడుకు చెందిన ఒక నటుడు. నిర్మాత, వివాదాస్పద వ్యక్తిగా పేరుపొందారు. 2011లో వచ్చిన “లత్తీకా” అనే తమిళ చిత్రంతో ఆయన వెలుగులోకి వచ్చారు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా నిర్మించి, సంగీతం కూడా అందించారు. తన చిత్రాలకు ముందు, వెనుక “పవర్ స్టార్” అనే బిరుదును తగిలించుకొని ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందారు. ఆయన విచిత్రమైన ప్రవర్తన, స్వీయ-పొగడ్తలు, ఆర్భాటమైన ప్రకటనలతో సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్ అవుతుంటారు. తాజాగా నటుడు […]
Athadu Re Release Trailer: మరోసారి బాక్సాఫీసు ముందుకు ‘అతడు’.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా!

తెలుగు సూపర్ స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అద్భుతమైన వార్త. ఆగస్టు 9న ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అతడు’ రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ మహేశ్‌బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. 2005లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించింది. సున్నితమైన భావోద్వేగాలు, థ్రిల్లింగ్ యాక్షన్ […]
Actress Nandini Kashyap Arrest: హిట్ అండ్ రన్ కేస్.. నటి నందిని కశ్యప్ అరెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో అస్సామీ నటి నందినీ కశ్యప్‌ను గువాహటి పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. జూలై 25న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నందినీ కశ్యప్ తన కారుతో 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి సమియుల్ హక్ను ఢీకొట్టి, అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సమియుల్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో నందినీ కశ్యప్ తన […]
this week ott movies: ఈ వారం ఓటీటీలో జాతరే జాతర.. మొత్తం 27 సినిమాలు, సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఏఏ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఐరన్ చెఫ్ థాయిలాండ్ వర్సెస్ ఆసియా (కుకింగ్ కాంపిటీషన్ సిరీస్)- జూలై 28 ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 29 డబ్ల్యూడబ్ల్యూఈ: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్)- జూలై 29 కన్వర్జేషన్స్ విత్ ఏ కిల్లర్: ది సన్ ఆఫ్ […]
Avatar 3 trailer: ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ విడుదల.. మరో విజువల్ వండర్ సిద్ధం!

జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం ‘అవతార్’ అభిమానులను మరోసారి అలరించడానికి సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది. ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమా థియేటర్లలో ప్రదర్శించిన తర్వాత, ఆన్‌లైన్‌లో కూడా విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, అవతార్ సిరీస్‌లో మూడవ భాగం. ట్రైలర్‌లో పండోరాలోని సరికొత్త నవీ తెగలు, […]
Coolie movie third song: రజినీకాంత్ ‘పవర్ హౌస్’ తెలుగు సాంగ్ గూస్ బంప్స్

రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం నుండి మూడవ పాట ‘పవర్‌హౌస్’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట మంగళవారం (జూలై 22)న హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అట్టహాసంగా ప్రారంభించబడింది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు అనిరుధ్, అరివు తమ గాత్రాన్ని అందించారు. ఇది అభిమానుల నుండి విశేష స్పందనను పొందింది. ‘పవర్‌హౌస్’ పాట సాహిత్యం, ఆకర్షణీయమైన బీట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ […]
Ustad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ షూటింగ్ పూర్తి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త పవన్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. మంగళవారం (జూలై 29)న మైత్రీ మూవీ మేకర్స్ ఈ అప్డేట్‌ను పంచుకున్నారు. ఈ క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగాలు, యాక్షన్ కలగలిపి అత్యంత పవర్‌ఫుల్‌గా రూపొందాయని, నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో అద్భుతంగా చిత్రీకరించారని చిత్ర బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ […]
Kaantha Teaser: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ టీజర్ అదిరిపోయింది మావా..

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘కాంత’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాల విజయాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్.. ఈసారి 1950ల మద్రాసు నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజర్ బట్టి.. ఒక హీరో (సల్మాన్), ఒక దర్శకుడు (సముద్రఖని) మధ్య అహం దెబ్బతినడం, వారి మధ్య […]
Hari hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ నుంచి ఆ సన్నివేశాలు తొలగింపు..

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం VFX (విజువల్ ఎఫెక్ట్స్) నాణ్యతపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంది. సినిమా విడుదలైన తర్వాత, ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామా కావడంతో, ప్రేక్షకులు అత్యున్నత స్థాయి VFXను ఆశించారు. అయితే, సినిమాలో చూపించిన చాలా సన్నివేశాల్లో VFX నాసిరకంగా ఉందని, గ్రాఫిక్స్ పనితనం సరిగా లేదని ప్రేక్షకులు విమర్శించారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ […]
kingdom trailer: ‘కింగ్డమ్’ ట్రైలర్ గూస్‌బంప్స్.. ఈ సీన్లు సినిమాకే హైలైట్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్డమ్’. ఈ మూవీ ట్రైలర్ శనివారం (జూలై 26) విడుదలైంది. తిరుపతిలో అత్యంత ఘనంగా జరిగిన ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ ఇంతకు ముందు ఎన్నడూ చూడని లుక్‌లో, గుండుతో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన డైలాగ్ డెలివరీ, నటన, […]