Dheeraj Kumar Death News: ప్రముఖ నటుడు, నిర్మాత ధీరజ్ కుమార్ ఇకలేరు

Dheeraj Kumar Death News: ప్రముఖ నటుడు, టెలివిజన్ సీరియల్స్ నిర్మాత ధీరజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ 79 సంవత్సరాల వయసులో జులై 15 తెల్లవారుజామున ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యూమోనియాతోపాటు వయోభారంతో వచ్చిన జబ్బులకు చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మరణ వార్త చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. శ్వాస సంబంధిత సమస్యలతో ఐసీయూలో చేరిక వివిధ మీడియాలు రిపోర్ట్ చేసిన ప్రకారం ఈ వారంలోనే ధీరజ్ […]
actress saroja devi died: అలనాటి అగ్రతార సరోజా దేవి కన్నుమూత.. ఆమె ప్రస్థానం ఇదే

భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన అలనాటి అగ్రతార, “అభినయ సరస్వతి” బి. సరోజా దేవి (87) సోమవారం (జులై 14) బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలతో కన్నుమూశారు. ఆమె మరణం సినీ లోకాన్ని, కోట్లాది మంది అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆమె సుదీర్ఘమైన, ఘనమైన సినీ కెరీర్ గురించి మరోసారి సినీ ప్రముఖులు, అభిమానులు స్మరించుకుంటున్నారు. సినిమాల్లోకి అనుకోని ప్రవేశం 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజా దేవికి […]
stunt master raju: సినిమా షూటింగ్‌లో విషాదం.. గాల్లో ఎగిరిన కారు.. స్టంట్ మాస్టర్ రాజు మృతి

కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎం. రాజు (మోహన్ రాజ్) పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న “వెట్టువన్” (Vettuvam) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం (జులై 13) నాగపట్నం సమీపంలో జరిగిన ఈ ఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. “వెట్టువన్” సినిమా కోసం అత్యంత ప్రమాదకరమైన కార్ జంప్ స్టంట్‌ను రాజు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్టంట్ చేస్తున్న సమయంలో […]
kannappa prabhas making video: ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ మేకింగ్ వీడియో.. చూస్తే గూస్‌బంప్స్ పక్కా!

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఇందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు సహా మరెందరో స్టార్ యాక్టర్స్ తమ పాత్రల్లో కనిపించి అలరించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. కన్నప్ప […]
anirudh : కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారంటే?

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కు మార్కెట్‌లో అద్భుతమైన పేరు, క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంది. ఇతడు సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడంటే.. ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ భావిస్తారు. ఇతడు రవి రాఘవేంద్ర, క్లాసికల్ డ్యాన్సర్ లక్ష్మి కొడుకు.. సినీ నిర్మాత కె సుబ్రమణ్యం మనవడు. అనిరుధ్ ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కుమార్, సూర్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సహా మరెంతోమంది సినిమాలకు మ్యూజిక్ అందించి పేరు సంపాదించుకున్నారు. ఇలాంటి ఒక […]
kannappa telugu trailer: ‘కన్నప్ప’ ట్రైలర్ సూపరెహే.. ప్రభాస్ ఊరమాస్ యాక్టింగ్

మంచు విష్ణు తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంతో వస్తున్నాడు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసి కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించడంతో మరింత బజ్ ఏర్పడింది. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ అండ్ సీనియర్ హీరోలు నటించడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ […]
sunjay kapoor passed away: గుండెపోటుతో స్టార్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన పోలో ఆడుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నటుడు, రచయిత సుహైల్ సేథ్ సంజయ్ మరణాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేసి సంతాపం తెలిపారు. ఆయన మరణానికి కొన్ని గంటల ముందు సంజయ్ కపూర్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ట్వీట్ చేశారు. జూన్ 12న సాయంత్రం 5 గంటల […]
this week ott movies: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్, సిరీస్‌లు..

కొత్త వారాంతం వచ్చేసింది. OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇక్కడ ఉంది. రానా దగ్గుబాటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు 2’ నుండి కరణ్ జోహార్ రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్’ వరకు విడుదలయ్యాయి. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. అభిమానులు ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా OTTలో చూడవచ్చు. రానా దగ్గుబాటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ […]
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బావ కో పైలట్ మృతి

2025 జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవడంతో తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కాగా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సన్నిహితుడు కూడా మరణించాడు. ఈ విషాద సంఘటనపై బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. విమానంలో ఇద్దరు […]
the indian house movie: ‘ది ఇండియా హౌస్’ మూవీ సెట్స్‌లో భారీ ప్రమాదం.. స్పందించిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది ఇండియా హౌస్’. ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ షూటింగ్ సెట్స్‌లో భారీ ప్రమాదం జరిగింది. గురువారం […]