cm chandrababu: అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం – సీఎం చంద్రబాబు

అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం శుక్రవారం అత్యంత గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. దీనికోసం పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి పూర్తయిన తర్వాత మోడీని మళ్లీ ఇక్కడికి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. దాదాపు 57,980 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ […]
caste enumeration: దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!

కేంద్ర ప్రభుత్వం బుధవారం పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కుల గణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ముందు తెలిపారు. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ” సమాజంలోని విలువలు, ప్రయోజనాలకు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని ఇది చూపిస్తుంది” అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంతా […]
simhachalam temple accident: సింహాచలం ఆలయ ప్రమాదంలో 8మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ప్రకటించిన సీఎం

ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో భారీ ప్రమాదం జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు మృతదేహాలను విశాఖ కే జి హెచ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులు, […]
Matsyakara Sevalo: వారికి అకౌంట్లోకి రూ.20,000.. చంద్రబాబు కొత్త పథకం షురూ

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మత్స్యకారులకు అండగా నిలిచింది. చేపల వేట పై ఆధారపడిన ఎన్నో కుటుంబాల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ” మత్స్యకార సేవలో” అనే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మత్స్యకార సేవలో అనే పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ 20 […]
Pahalgam attack: పహల్గాం దాడి.. ఏపీ బాధితులకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి సంచలనం రేపింది. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాం ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ హింసకాండలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు విశాఖ వాసి […]
jammu kashmir: ఆర్మీ దుస్తుల్లో వచ్చి టూరిస్టులపై ఉగ్రదాడి.. 28 మంది మృతి!

జమ్మూ కాశ్మీర్లో దారుణం జరిగింది. పహల్గాం లోని బైసరన్ లో ఉగ్రదాడి జరిగింది. మినీ స్విట్జర్లాండ్ గా పిలవబడే పహాల్గంలోని పర్యాటక ప్రదేశంలో పర్యటకులపై ఉగ్రవాదులు హింసకాండ సృష్టించారు. ఫలానా మతాన్ని అవలంబించలేదని కారణంతో దాదాపు 28 మంది అమాయకులను హతమార్చారు. ఇక బైసరన్ కాల్పుల శబ్దం వినిపించగానే భద్రత బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అనంతరం ఆ ప్రాంతానికి అదనపు సెక్యూరిటీ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో గాయపడిన వారిని సమీప హాస్పిటల్కు […]
Wines Close: మందు బాబులకు బిగ్ షాక్.. మూడు రోజులు వైన్స్ బంద్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా మూడు రోజులు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాకుండా కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 21 అంటే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి 23వ తేదీ అంటే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దానికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ 23న స్థానిక సంస్థల […]
75 ఏళ్ల చంద్రబాబు నాయుడి జీవితం ఓ సైకలాజికల్ కేస్ స్టడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరం లోకి అడుగు పెట్టారు. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఈ జర్నీలో ఆయన అనేక విజయాలు అంతకు మించిన అపజయాలను చవి చూశారు. పార్టీలో ఫ్యామిలీలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఎవరైనా భయపడిపోతారు. కానీ చంద్రబాబు నాయుడులాంటి వ్యక్తి మాత్రం వీటికి భిన్నం. సమస్యను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. అందుకే చంద్రబాబు […]
bhu bharati portal: ‘భూ భారతి’ పోర్టల్ సేవలు – భూమి వివరాలను చెక్ చేసుకోండిలా?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ఇటీవల అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే “భూ భారతి”. పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి సేవలను అమల్లోకి తీసుకొచ్చారు. దీనితోపాటు భూభారతి పోర్టల్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కువగా భూముల రిజిస్ట్రేషన్లు, అలాగే భూముల నిర్వహణ వంటి అంశాలన్నీ భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. ఈ సేవలు ఏప్రిల్ 14 నుంచి పైలెట్ ప్రాజెక్టుగా కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా […]
Andhra Pradesh: రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ.. ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. ఇందులో భాగంగానే గురువారం ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలులోకి తెచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంగళవారం ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర గవర్నర్ దీన్ని ఆమోదించారు. దీంతో గురువారం అఫీషియల్ గా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025 కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి దీనిని రిలీజ్ చేశారు. తద్వారా విద్యాసంస్థల్లో […]