kids health tips: వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం: తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!

వర్షాకాలం వచ్చిందంటే చాలు, వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అయితే, ఈ సీజన్ అనేక రకాల ఆరోగ్య సమస్యలను కూడా తనతో పాటు తీసుకొస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఈ సమయంలో సులభంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, వాతావరణంలో తేమ, బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తి పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటివి వర్షాకాలంలో పిల్లలకు సాధారణంగా వచ్చే అనారోగ్యాలు. […]
shubman gill: కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 5 రికార్డులు

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ సంచలన ప్రదర్శనతో పలు రికార్డులను తిరగరాశాడు. యువ కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో పరుగులు వరద పారించి, చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ చేసిన పరుగులతో నెలకొల్పిన 5 ముఖ్యమైన రికార్డులు తెలుసుకుందాం. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్ శుభమన్ గిల్ రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో (269 […]
Prabhas : ప్రభాస్ ఎలాంటి సహాయం చేయలేదు.. ఫిష్ వెంకట్ కుమార్తెల ఆవేదన

టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కిడ్నీ మార్పిడి అత్యవసరమని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని, అంత మొత్తం తమ వద్ద లేదని ఫిష్ వెంకట్ భార్య, కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ టీం నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, కిడ్నీ మార్పిడికి అవసరమయ్యే రూ. 50 […]
Monsoon Tips: వర్షాకాలంలో అందంగా.. జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!

వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, గాలిలో అధిక తేమ, బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాప్తి పెరగడం వల్ల చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో మహిళలు తమ అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చర్మ సంరక్షణ: క్లెన్సింగ్: వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారే అవకాశం ఎక్కువ. రోజుకు కనీసం రెండు సార్లు తేలికపాటి, సల్ఫేట్ లేని క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంపై పేరుకున్న దుమ్ము, జిడ్డును తొలగిస్తుంది. […]
Oh Bhama Ayyo Rama Trailer: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ ఫుల్ కామెడీ.. సుహాస్‌కు మరో హిట్టు పక్కా!

వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటుడు సుహాస్ నటించిన తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతోంది. రామ్ గోధల దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌ను వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది […]
women health diet foods: అన్ని సమస్యలకు చెక్ పెట్టే డైట్.. ఇలా చేస్తే మహిళలు ఫిట్!

నేటి బిజీ జీవితంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం దొరకడం లేదు. మహిళలు ఎక్కువగా తమ ఆఫీసు పనితో పాటు ఇంటి పనులపై కూడా శ్రద్ధ వహిస్తారు. అందువల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. నేటి జీవనశైలి ప్రకారం.. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం గతంలో కంటే చాలా ముఖ్యమైనదిగా మారింది. చర్మ కాంతి అయినా, హార్మోన్ల సమతుల్యత అయినా లేదా పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యలు అయినా, సరైన ఆహారం అందరికీ ముఖ్యం. […]
unhealthy foods for kids: ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండకపోతే.. పిల్లల్ని ఎవరూ కాపాడలేరు..!

జంక్ ఫుడ్స్ తినడం వల్ల ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి మంచివి కావు. పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం ద్వారా, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. పిల్లల ఆహారం ఎలా ఉండాలో తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నేటి కాలంలో తల్లిదండ్రులు తెలిసి లేదా తెలియకుండానే తమ ఇళ్లలో ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ వస్తువులను నిల్వ చేస్తారు. వీటిలో ఉప్పు, చక్కెర, నూనె, హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి వారి శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. పిల్లలకు […]
mohammed siraj: సెకండ్ టెస్ట్‌లో సిరాజ్ చరిత్ర సృష్టించాడు.. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. మూడో రోజు మొహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో సిరాజ్ ఈసారి బాధ్యతను తన బుజాలపై వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ 6 వికెట్లు తీసుకున్నాడు. దీంతో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా.. మొహమ్మద్ సిరాజ్ ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించాడు. 32 సంవత్సరాల తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో ఘనత ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ నుంచి […]
prabhas : ప్రభాస్ గొప్ప మనసు.. ఫిష్ వెంకట్ కిడ్నీ సర్జరీకి రూ.50లక్షల సహాయం

టాలీవుడ్‌లో ఫిష్ వెంకట్‌గా పేరుగాంచిన నటుడు, కమెడియన్ పరిస్థితి ఇప్పుడు అధ్వనంగా మారింది. ప్రస్తుతం అతడు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో హాస్పిటల్‌లోని వెంటిలేటర్ పై ఉన్నారు. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉంది. అతడు ఐసీయూలో ఉన్నాడు. దీంతో వెంకట్ కుమార్తె స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. డాక్టర్లు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారని.. అయితే దానికి కనీసం రూ. 50 లక్షలు వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ విషయం తెలిసి పాన్ […]
monsoon health tips: వర్షాకాలంలో కడుపు సమస్యలను ఇలా చెక్ పెట్టేయండి.. చాలా సింపుల్!

వర్షాకాలం వచ్చిందంటే.. వ్యాధులు, ముఖ్యంగా కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల అజీర్ణం, అపానవాయువు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు పెరుగుతాయి. వర్షాకాలంలో కడుపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఆహారంలో ఏ పదార్థాలు చేర్చుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. జీర్ణక్రియ ఎందుకు నెమ్మదిస్తుంది.. వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా జరగడానికి అనేక కారణాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా […]