sunjay kapoor passed away: గుండెపోటుతో స్టార్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన పోలో ఆడుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నటుడు, రచయిత సుహైల్ సేథ్ సంజయ్ మరణాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేసి సంతాపం తెలిపారు. ఆయన మరణానికి కొన్ని గంటల ముందు సంజయ్ కపూర్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ట్వీట్ చేశారు.

జూన్ 12న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సంజయ్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరి పోస్ట్ పెట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తన పోస్ట్‌లో.. ‘‘అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి చాలా విచారకరమైన వార్త అందింది.

బాధిత కుటుంబాలందరికీ నా సంతాపం, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించుగాక’’ అని రాసుకొచ్చారు. అది పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే సంజయ్ మృతి చెందడం బాధాకరమైన విషయం.

కరిష్మా కపూర్‌తో విడాకులు

కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ 2003 లో వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాలలోనే వారి సంబంధం తెగిపోయింది. 2014 లో విడాకులు తీసుకున్నారు. కరిష్మా, సంజయ్ లకు ఇద్దరు పిల్లలు. అందులో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. ఆ తర్వాత సంజయ కపూర్ ప్రియా సచ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం