akhil zainab wedding photos: ఘనంగా అఖిల్-జైనాబ్ పెళ్లి.. ఎమోషనలైన నాగార్జున

టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ముంబైకి చెందిన తన ప్రేయసి, ఆర్టిస్ట్-వ్యాపారవేత్త జైనాబ్ రవ్‌జీను వివాహమాడాడు. నిన్న తెల్లవారుజామున 3. 30 నిమిషాలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నాగార్జున నివాసంలోనే వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ లవ్ కపుల్.. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ మేరకు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన చిన్న కొడుకు జీవిత భాగస్వామిని పొందడం ‘కల నిజమైన క్షణం’ అని నాగార్జున తన పోస్టులో రాసుకొచ్చారు

కొడుకు అఖిల్, కోడలు జైనాబ్‌ల పెళ్లి ఫొటోలను నాగార్జున తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్లో షేర్ చేశాడు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 3:35 గంటలకు తమ నివాసంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలిపాడు. తన ప్రియమైన కుమారుడు తన ప్రియమైన జైనాబ్‌ను మా ఇంట్లో అందమైన వేడుకలో పెళ్లి చేసుకున్నాడు అని తెలిపాడు. ఈ విషయం తెలియజేయడానికి అమల, నేను సంతోషిస్తున్నాము. ప్రేమ, నవ్వులు తమకు అత్యంత ప్రియమైన వారి మధ్య ఒక కల నిజమవడం చూశామని అన్నాడు.

ఈ కొత్త ప్రయాణాన్ని కలిసి మొదలుపెట్టే వారికి మీ ఆశీస్సులు కోరుతున్నాం అని అందులో రాసుకొచ్చాడు. ఇక నాగ్ షేర్ చేసిన ఫొటోలో అమల.. జైనాబ్, అఖిల్‌లను గట్టిగా పట్టుకొని ఆనందంగా కనిపిస్తుంది. మరొక ఫొటోలో అఖిల్, జైనాబ్ మెడలో తాళి కడుతున్నట్లు ఉంది. అలాగే అఖిల్, జైనాబ్‌ ఏడు అడుగులు వేస్తున్న ఫొటోలను.. నవ్వుతూ ఉన్న ఫొటోలను కూడా నాగార్జున పంచుకున్నాడు. ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

తరవాత కథనం