ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప2 మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దుమ్ము దులిపేసింది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేర్ చేసింది. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
మూడేళ్ల నిరీక్షణ తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలని మించిపోయింది. 500 కాదు 1000 కాదు ఏకంగా రెండు వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ నటులకు దక్కని క్రేజ్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. కలెక్షన్లలో కూడా అక్క అబ్బురపరచింది.
దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ఇక థియేటర్లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిన ఈ సినిమా తాజాగా ఓటిటిలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి ఓటీటీలో ఫుల్ రెస్పాన్స్ వస్తుంది.
కనీ విని ఎరుగని రీతిలో ఈ చిత్రం దూసుకుపోతుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసినవారు సైతం ఓటీటీలో చూసేందుకు ఎగబడుతున్నారు. ఇలాంటి రెస్పాన్స్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రీట్ ఇచ్చేసింది. తాజాగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మరి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.