anirudh : కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారంటే?

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కు మార్కెట్‌లో అద్భుతమైన పేరు, క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంది. ఇతడు సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడంటే.. ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ భావిస్తారు. ఇతడు రవి రాఘవేంద్ర, క్లాసికల్ డ్యాన్సర్ లక్ష్మి కొడుకు.. సినీ నిర్మాత కె సుబ్రమణ్యం మనవడు. అనిరుధ్ ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కుమార్, సూర్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సహా మరెంతోమంది సినిమాలకు మ్యూజిక్ అందించి పేరు సంపాదించుకున్నారు.

ఇలాంటి ఒక మ్యాజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమలో పడ్డారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనిరుధ్, సన్ టీవీ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు యజమాని కావ్య మారన్‌తో ప్రేమలో పడ్డాడని గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అంతేకాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా కావ్య తండ్రి కళానిధి మారన్‌తో వారిద్దరి సంబంధం గురించి మాట్లాడి పెళ్లి సెట్ చేశారని.. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకుంటారని ఓ రేంజ్‌లో ఊహాగానాలు వస్తున్నాయి. అనిరుధ్, కావ్య కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని నెట్టింట వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలోనే వీరు తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని రూమర్లు పెద్ద ఎత్తున వచ్చాయి.

అవి కాస్త మరింత వైరల్ గా మారడంతో అనిరుధ్ వాటిపై క్లారిటీ ఇచ్చాడు. కావ్య మారన్‌తో పెళ్లి రూమర్స్ పై స్పందించారు. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజమూ లేదని క్లారిటీ ఇచ్చాడు. అదంతా ఫేక్ ప్రచారమని అన్నారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘‘వివాహమా? లాల్ .. చిల్ అవ్వండి గాయ్స్. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి” అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం