Meenakshi Chaudhary: కుర్రకారు మతి పోగొట్టే అందం. యువకులను ఆకర్షించే నవ్వు. అన్నికలిపితే లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షీ చౌదరి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటీ.. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిట్ 2 తో తాను కూడా హిట్ కొట్టేసింది. ఆపై వరుసగా గుంటూరు కారం, లక్కీ భాస్కర్, దళపతి విజయ్ సరసన స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వచ్చేసింది. ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో విక్టరీ వెంకటేష్ సరసన నటించి మరోసారి హైలెట్ అయింది.
Also Read: ఫ్యాన్స్‌కి పండగే పండగ.. ఒక రోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’
ఇదిలా ఉంటే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షీ చౌదరి నియమితులు అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆమె నియామకం పట్ల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్డ్ చెక్ విభాగం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రభుత్వం పేరుతో ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతూ.. ఫేక్ ప్రచారం చేస్తున్న ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి.… pic.twitter.com/96uI4Xb0Zr
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 2, 2025





