ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరూన్ సృష్టి, ‘అవతార్’ ఫ్రాంచైజీలోని మూడో భాగం “అవతార్: ఫైర్ అండ్ యాష్” నుండి తొలి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సినిమా టైటిల్‌ను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో “వరాంగ్” అనే కొత్త పాత్రను పరిచయం చేశారు. ఈ పోస్టర్‌లో వరాంగ్ అగ్నిని ప్రతిబింబిస్తూ, మరింత గాఢమైన, భయంకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇదివరకు వచ్చిన ‘అవతార్’,’అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పోస్టర్‌లలో మహిళా ప్రధాన పాత్రలు ఉండగా, ‘ఫైర్ అండ్ యాష్’లో కూడా అదే ట్రెండ్‌ను కొనసాగించారు. ఇది సినిమా యొక్క darker toneని తెలియజేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్‌పై కూడా చిత్రబృందం ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ఈ ట్రైలర్‌ను ఈ శుక్రవారం (జూలై 25, 2025) విడుదల కానున్న హాలీవుడ్ చిత్రం “ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్” తో పాటు థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, సిగౌర్నీ వీవర్, జోయెల్ డేవిడ్ మూర్, సీసీహెచ్ పౌండర్, జియోవానీ రిబిసి వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 20వ సెంచరీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘అవతార్’ ఫ్రాంచైజీలో మొత్తం ఐదు భాగాలు రానున్నాయని, 2029లో ‘అవతార్ 4’, 2031లో ‘అవతార్ 5’ విడుదల కానున్నాయని గతంలోనే ప్రకటించారు.






