Akhanda 2 teaser: బాలయ్య బాబు ‘అఖండ 2’ పవర్‌ఫుల్ టీజర్.. చూస్తే గూస్‌బంప్సే

బోయపాటి శ్రీను, బాల‌కృష్ణ‌ కాంబినేషన్ కు ఉండే క్రేజే వేరు. మరోసారి వీళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘అఖండ 2’తో వచ్చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాలయ్యను కంబ్యాక్ చేసింది.

ఈ చిత్రం అఖండ 2 దసరా సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది.

అంచనాలకు తగ్గట్టుగా దర్శకుడు బోయపాటి శ్రీను అభిమానులు కోరుకున్నది అందించారు. ఈ టీజర్ లో బాలకృష్ణను హిమాలయాలలో పరిచయం చేస్తున్నారు. బాలకృష్ణ ఒక ఋషి గెటప్ లో గూండాలతో పోరాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ టీజర్‌లో బాలయ్య పవర్‌ఫుల్ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. గూండాలు కొన్ని హై ప్రొఫైల్ ఆయుధాలను పట్టుకుని కనిపించగా వారందరినీ ఒకేసారి పైపైకి లేపి చేసిన ఫైట్ ఓ రేంజ్‌లో ఉంది.

టీజర్ బట్టి ఈ చిత్రం ఫుల్ యాక్షన్ డ్రామా అని తెలిసింది. అఖండ పార్ట్ 1 లో బాలకృష్ణను సాధారణ గెటప్‌లో కూడా చూశాం. కానీ ఈసారి సెకండ్ పార్ట్‌లో బాలకృష్ణను సినిమా అంతటా సాధువు గెటప్‌లో చూడబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇది మరింత బజ్ క్రియేట్ చేసింది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం