balakrishna : మరోసారి బాలయ్య, క్రిష్‌ జాగర్లమూడి.. ‘ఆదిత్య 999’ కోసం సన్నాహాలు..!

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలయికలో మరో సినిమా రాబోతోందని తాజా సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వచ్చింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అలాగే ‘ఎన్టీఆర్ బయోపిక్’ (కథానాయకుడు, మహానాయకుడు) మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయినప్పటికీ క్రిష్ దర్శకత్వ ప్రతిభపై బాలకృష్ణకు నమ్మకం ఉండటంతో నాలుగోసారి ఈ కాంబినేషన్ కుదిరిందని తెలుస్తోంది.

ఆదిత్య 999 ప్రాజెక్టు క్రిష్ చేతుల్లోకి?

చాలా కాలంగా బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే, తాజా వార్తల ప్రకారం, ఈ ప్రాజెక్టు బాధ్యతను క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్లు తెలుస్తోంది. ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని, ఫాంటసీ కథాంశంతో రూపొందించనున్నారని సమాచారం. ఈ సినిమాతోనే బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను కూడా పరిచయం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఆదిత్య 999’ కథా రూపకల్పనలో సింగీతం శ్రీనివాసరావు కూడా పాలుపంచుకున్నారని తెలుస్తోంది.

ప్రస్తుత ప్రాజెక్టులు:

ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ-2’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తవగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటే ‘ఆదిత్య 999’ చిత్రాన్ని కూడా సమాంతరంగా రూపొందించాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరోవైపు, దర్శకుడు క్రిష్ అనుష్క షెట్టితో తీసిన ‘ఘాటి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో చేసే ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ – క్రిష్ కలయికలో రాబోయే ఈ ఫాంటసీ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి క్రిష్ బాలకృష్ణకు మరో భారీ విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం