హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్కటీ ఆశించినంత స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోతుంది. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల బాట పట్టాడు. ఇందులో భాగంగానే తన కెరీర్లో 11వ చిత్రం చేస్తున్నాడు. అదే కిష్కంధపురి చిత్రం.
ఇప్పటివరకు లవ్, యాక్షన్, క్రైమ్ జోనర్లలో ప్రేక్షకులను అలరించిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ మూవీతో వచ్చేస్తున్నాడు. ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయి శ్రీనివాస్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. సాహు గారపాటి నిర్మిస్తున్న సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మేరకు మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ బట్టి చూస్తుంటే ఈ సినిమా మొత్తం హర్రర్ థ్రిల్లర్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉన్న ఉత్కంఠ భరతమైన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా సాయి శ్రీనివాస్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ గ్లిమ్స్ లో ఒక్కో దగ్గర స్క్రీన్ మీద కొన్ని డోర్లను ముట్టుకోవద్దు.. మరికొన్ని దగ్గర్లో కొన్ని చోట్లకి వెళ్లొద్దు అని రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందులోనే కొన్ని డోర్లు క్లోజ్ అవుతుంటే వచ్చే శబ్దాలు భయానకంగా ఉన్నాయి. చివర్లో అహం మృత్యుమ్ అనే సాయి శ్రీనివాస్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.
సినిమా చివర్లో హీరో సాయి శ్రీనివాస్ కూడా దెయ్యంగా మారినట్టు చూపిస్తుంది. మొత్తంగా ఈ గ్లిమ్స్ అందర్నీ అలరిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.