Bigg Boss Telugu 9: బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ తో అలరించబోతుంది. తాజాగా సీజన్ 9 ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ప్రోమో చూస్తుంటే.. గత సీజన్ల కంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా, భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. వెన్నెల కిషోర్- నాగార్జున సంభాషణలతో ప్రోమో ఆసక్తిని రేపుతోంది. ఈసారి ‘డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఈ డైలాగ్ వింటుంటే సెలబ్రెటీస్ వెర్సెస్ కామనర్స్ గా సీజన్ ఉండబోతుందని అర్థమవుతోంది. అయితే ఈ సీజన్ లో సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చారు మేకర్స్. ఇక చివరిగా నాగార్జున ఈ సారి ‘బిగ్ బాస్ నే మార్చేశా’ అని అనడం మరింత ఇంట్రెస్ట్ ని పెంచింది.






