Mukul Dev: బాలీవుడ్ స్టార్ నటుడు ముకుల్ దేవ్ మృతి..

బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ న్యూఢిల్లీలో 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ శనివారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ముకుల్ మరణ వార్తను వెల్లడించారు. ముకుల్ తన కుమార్తె సియా దేవ్ తో ఉన్నారని.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరికి పోరాడుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఈ మేరకు ఇన్‌సస్టాగ్రామ్ ద్వారా రాహుల్ దేవ్ ఒక పోస్టు పెట్టారు. తమ సోదరుడు ముకుల్ దేవ్ నిన్న రాత్రి న్యూఢిల్లీలో ప్రశాంతంగా కన్నుమూశారు అని తెలిపారు.

ఆయన మరణ వార్తను ఆయన సహనటుడు విందు దారా సింగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ధృవీకరించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, ముకుల్‌తో తాను కలిసి ఉన్న వీడియోను షేర్ చేసి, “బ్రదర్ మీకు శాంతి కలుగుగాక” అని రాశారు. విందు దారా సింగ్ తన అధికారిక X ఖాతాలోకి వెళ్లి తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు. ట్వీట్‌లో, “నా సోదరుడు #ముకుల్‌దేవ్ మీకు శాంతి కలుగుగాక! మీతో గడిపిన సమయం ఎల్లప్పుడూ విలువైనది మరియు #సన్ఆఫ్సర్దార్2 మీ హంసగీతం అవుతుంది, ఇక్కడ మీరు వీక్షకులకు ఆనందం మరియు ఆనందాన్ని పంచుతారు మరియు వారిని నవ్విస్తారు!” అని రాశారు.

సోను సూద్

బాలీవుడ్ నటుడు సోను సూద్ ట్వీట్ ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘RIP ముకుల్ భాయ్ మీరు ఒక రత్నం. ఎల్లప్పుడూ మిమ్మల్ని మిస్ అవుతాము. దృఢంగా ఉండండి రాహుల్ దేవ్ భాయ్’’ అని రాశారు.

మనోజ్ బాజ్‌పేయి

ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పేయి కూడా ఒక ట్వీట్‌ను షేర్ చేసి.. ‘‘నేను ఏమి అనుభూతి చెందుతున్నానో మాటల్లో చెప్పడం అసాధ్యం. చాలా త్వరగా, చాలా చిన్న వయస్సులోనే వెళ్ళిపోయాడు. అతని కుటుంబానికి, ఈ నష్టాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికీ బలం కోసం ప్రార్థిస్తున్నాను. మేరీ జాన్‌ను మిస్ అవుతున్నాను.. మనం మళ్ళీ కలిసే వరకు, ఓం శాంతి’’ అని రాశారు.

దీప్శిఖా నాగ్‌పాల్

నటి దీప్శిఖా నాగ్‌పాల్ కూడా సోషల్ మీడియా ద్వారా నటుడు ముకుల్ దేవ్ మరణాన్ని వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముకుల్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుంది. RIP GIFతో పాటు ‘‘నేను దీనిని నమ్మలేకపోతున్నాను’’ అని రాసింది.

ఇదిలా ఉంటే 1996లో ‘దస్తక్’ చిత్రంతో ముకుల్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇందులో ఆయన నెగటివ్ రోల్ పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుష్మితా సేన్ , ముకుల్ దేవ్, మనోజ్ బాజ్‌పేయి, టికు తల్సానియా, విశ్వజీత్ ప్రధాన్, శరద్ ఎస్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆయన తండ్రి హరి దేవ్ ఢిల్లీ పోలీస్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. పాష్టో, పర్షియన్ భాషలను మాట్లాడుతారు. నటుడి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది.

తరవాత కథనం