ఇండియాలో సూపర్ హీరో సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా మార్వెల్ చిత్రాలు అంటే ఫ్యాన్స్ పడి చచ్చిపోవాల్సిందే. థార్, అవెంజర్స్, కెప్టెన్ అమెరికా ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. మార్వెల్ మూవీస్ ఇష్టపడేవారికి ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. మరో మార్వెల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కెప్టెన్ అమెరికా సిరీస్‌లో కొత్త మూవీ ‘కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్’ ఓటీటీలోకి వచ్చేసింది.
ఏ ఓటీటీలో?
కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొడుతున్న ఈ చిత్రం ఓటీటీలో దుమ్ముదులిపేస్తుంది. కాగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇలా ఈ మూవీ నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ హాలీవుడ్ మూవీ ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ్లో ఓటీటీలోకి వచ్చేసింది.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్’ సినిమా 35వ చిత్రం. అందులోనూ కెప్టెన్ అమెరికా సిరీస్‌లో నాలుగో సినిమా. 2021లో వచ్చిన ‘ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి జులియస్ ఒనా దర్శకత్వం వహించగా.. మార్వెల్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసింది.
కలెక్షన్లు
కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమాను చైనీస్ థియేటర్లతో ఫిబ్రవరి 11న ప్రీమియర్ వేశారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వరల్డ్ వైడ్‌గా 415 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. 2025లో ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది.