మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మల్లిడి వశిష్టతో ఈసారి జత కట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సరి కొత్త చిత్రం విశ్వంబర. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోసియో ఫాంటసీ గా విశ్వంబర చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇందులో చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ త్రిష జోడిగా నటిస్తుంది. ఆమెతో పాటు మరెందరో నటీమణులు ఇందులో భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల శ్రీరామ్ నవమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకే ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం అందింది. సోషియో ఫాంటసీ గా వస్తున్న ఈ సినిమా గురించి తరచు ఏదో ఒక అప్డేట్ చెక్కర్లు కొడుతూనే ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కోసం సుమారు 75 కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ వి ఎఫ్ ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. కేవలం విఎఫ్ఎక్స్ కోసమే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాబట్టి ఈ మూవీ రియల్ గా కంటే విఎఫ్ఎక్స్ మీదనే ఎక్కువగా నడుస్తుంది అర్థం అయి పోయింది.