COOLIE: సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో తలైవా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా రజినీ మేనియా స్టార్ట్ అయిపోయింది. బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్
చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో టికెట్లు దొరకడమే కష్టంగా ఉంది. చాలా థియేటర్లు మొదటి మూడు రోజులు ఫుల్ అయిపోయాయి. కొందరు అభిమానులు రాత్రి నుంచి టికెట్ల కోసం క్యూలో నిలబడినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికినవాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇది చూస్తుంటే.. రజినీ కాంత్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 80 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తమిళనాడులో రూ. 27 కోట్లకు పైగా అడ్వాన్స్ జరగగా.. ఇండియా మొత్తంలో రూ. 53 కోట్లు చేసినట్లు సమాచారం. ఇక ఓవర్ సీస్ లో రూ.35 కోట్లు చేసింది. దీంతో రిలీజ్ కి ముందే ‘కూలీ’ రూ. 100 కోట్ల మార్క్ ని దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ అమెరికాలో $2 మిలియన్ డాలర్ల ప్రీమియర్ ప్రీ సేల్స్ చేసిన తొలి తమిళ్ సినిమాగా కూలీ రికార్డ్ క్రియేట్ చేసింది.






