Coolie Remuneration: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. “కూలీ” సినిమా స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ తో పాటు నటీనటులకు కూడా భారీగానే పారితోషికాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రజినీకాంత్
ఈ సినిమాలో రజినీకాంత్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. మొదట రూ.150 కోట్లుగా నిర్ణయించినప్పటికీ, సినిమా రికార్డు స్థాయి ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను చూసి, నిర్మాతలు ఆయన పారితోషికాన్ని రూ. 200 కోట్లకు పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో రజినీకాంత్ ‘దేవా’ పాత్రలో కనిపించనున్నారు.
లోకేష్ కనగరాజ్
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రూ. 50 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
నాగార్జున
ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున, రూ. 10 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం.
ఆమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో 15-20 నిమిషాల అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన రూ. 20 కోట్లు తీసుకున్నారట.
శృతి హాసన్
సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన శృతి హాసన్ రూ. 4 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమా కోసం రూ. 4 కోట్లు అందుకున్నారని వార్తలు వస్తున్నాయి.
సత్యరాజ్
నటుడు సత్యరాజ్ కు రూ. 5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పూజా హెగ్డే
“మోనికా” అనే పాటలో స్పెషల్ డ్యాన్స్ తో అదరగొట్టిన పూజా హెగ్డే రూ. 3 కోట్లు తీసుకున్నారట.
అనిరుధ్ రవిచందర్
అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు రూ. 15 కోట్లు పారితోషికం తీసుకున్నారని సమాచారం.
ఈ రెమ్యునరేషన్ వివరాలకు సంబంధించి అధికారిక ప్రకటన లేనప్పటికీ .. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.






