‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్
సంతోష శోభన్- మానస వారణాసి ఈ చిత్రంలో జంటగా నటించారు. ఇద్దరి ప్రేమికుల కథగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో హీరో ఒక ర్యాపిడో సర్వీస్ బాయ్ గా పనిచేస్తుండగా.. హీరోయిన్ ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ. టీజర్ మధ్యలో హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్స్ కూడా చూపించారు. టీజర్‌లో హీరో సంతోష్ శోభన్ గడ్డంతో, సరిగా దువ్వని జుట్టుతో చాలా సహజంగా కనిపిస్తున్నాడు. టీజర్ చివరిలో సంతోష్, హీరోయిన్‌తో “నా సర్వీస్‌కి రేటింగ్ ఇవ్వు… ఫైవ్ స్టార్స్” అని చెప్పడంతో ముగుస్తుంది.






