Kaantha Teaser: దుల్కర్‌ సల్మాన్‌ ‘కాంత’ టీజర్‌ అదిరిపోయింది మావా..

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘కాంత’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాల విజయాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్.. ఈసారి 1950ల మద్రాసు నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

టీజర్ బట్టి.. ఒక హీరో (సల్మాన్), ఒక దర్శకుడు (సముద్రఖని) మధ్య అహం దెబ్బతినడం, వారి మధ్య జరిగే సంఘర్షణ ప్రధాన కథాంశంగా కనిపిస్తుంది. కెరీర్ ఆరంభంలో స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ, కాలక్రమంలో విభేదించి విడిపోతారు. సముద్రఖని ‘శాంత’ అనే హారర్ చిత్రాన్ని తెరకెక్కించాలనుకోగా, దుల్కర్ ఆ ప్రాజెక్ట్‌ను తన ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి ‘కాంత’గా మార్చినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో, వింటేజ్ వాతావరణాన్ని అద్భుతంగా సృష్టించిన ఈ టీజర్, దుల్కర్ నటనకు మరోసారి ప్రశంసలు దక్కేలా ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం