Faria Abdullah: చిట్టి’ దూకుడు.. తెలుగు, తమిళ్ చిత్రాలతో ఫుల్ బిజీ!

Faria Abdullah: ‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆరడుగుల సుందరి ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో ఫరియా నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అడుగులు వేస్తోంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ ఉంటుంది ఈ బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా వైట్ మినీ స్కర్ట్ లో ఫరియా ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెడ్ పై పడుకొని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.

ప్రస్తుతం ఫరియా తెలుగులో ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో ఫరియా కామెడీ సన్నివేశాలు జాతిరత్నాలు సినిమాను మరోసారి గుర్తుచేశాయి.

ఇటీవలే విడుదలైన ‘మత్తు వదలరా 2’ సినిమాలో కూడా ఫరియా అబ్దుల్లా తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాకు గాను ఆమెకు ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’లో స్పెషల్ జ్యురీ అవార్డు లభించింది.

ఫరియా ‘వల్లి మయిల్’ అనే తమిళ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెడుతోంది. ఇందులో ఆమె విజయ్ ఆంటోనీ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. మొత్తానికి, ఫరియా అబ్దుల్లా తన సినిమా ఎంపికల్లో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల ముందుకు కొత్త కొత్త పాత్రలతో వస్తోంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం