avengers doomsday: రూ.8500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న హాలీవుడ్ ‘అవెంజర్స్: డూమ్స్ డే’!

హాలీవుడ్ చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చి ప్రేమ. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్, అడ్వంచరస్, ఫాంటసీ వంటివి ఉండటంతో సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ చిత్రం రాబోతోంది. ఈ మూవీ బడ్జెట్, నటీ నటుల రెమ్యూనరేషన్ కొన్ని కోట్లు. అవును మీరు విన్నది నిజమే. ఇందులో నటించే నటీ నటుల రెమ్యునరేషన్లు ఏకంగా రూ.2100 కోట్లు. ఈ మూవీ మొత్తం బడ్జెట్, మార్కెటింగ్, ప్రమోషన్లను ఇలా ఇవన్నీ కలుపుకుంటే ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8500 కోట్లు) కావడంతో హాలీవుడ్‌తో పాటు, మిగత సినీ ఇండస్ట్రీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.

ఆ మూవీ మరింకేదో కాదు.. అవెంజర్స్: డూమ్స్‌డే. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. దీంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సినిమాగా చెబుతున్నారు. కేవలం మూవీ ప్రీప్రొడక్షన్ కోసం మేకర్స్ 80 లక్షల డాలర్లు (రూ.68 కోట్లు) ఖర్చు పెట్టడం విశేషం.

మార్వెల్ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్, పబ్లిసిటీ కోసం భారీగానే ఖర్చు చేస్తుంది. దీంతో సినిమా మొత్తం 100 కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. మన కరెన్సీలో సుమారు రూ.8500 కోట్లు అన్నమాట.

అయితే ఈ చిత్రం కోసం ఇంత ఖర్చు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. దీని కోసం వీఎఫ్ఎక్స్ పై అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ఏకంగా 35 మంది స్టార్ నటీనటులు భాగగమైనట్లు తెలుస్తోంది. వాళ్ల రెమ్యునరేషన్లు అన్నీ కలిపి 25 కోట్ల డాలర్లు అవుతుందని అంటే భారత కరెన్సీలో రూ.2100 కోట్లు.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది 39వ సినిమాగా రాబోతుంది. అవెంజర్స్ ఫ్రాంఛైజీలో ఇది 5వ చిత్రం. ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్, సెబాస్టియన్ స్టాన్, పాల్ రుడ్, ఆంథోనీ మాకీ, వానెస్సా కిర్బీ, వ్యాట్ రసెల్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్ 26న కానున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం