Miss World 2025: తెలంగాణ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు

Miss World 2025

Miss World 2025: మిస్ వరల్డ్.. బ్యూటీ విత్ పర్పస్.. ఈ మెగా బ్యూటీ ఈవెంట్ 72వ ఎడిషన్ కు తెలంగాణ వేదికైంది. ప్రపంచమంతా ఇటువైపే చూసే వరల్డ్ క్లాస్ ఈవెంట్ ఇది. మే 7 నుంచి మే 31 వరకు ఈ అందాల పోటీలు జరగబోతున్నాయి. గతేడాది ముంబై ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. ఇప్పుడు హిస్టారికల్ అండ్ ఐటీ సిటీ హైదరాబాద్ గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. ఒక్క ఈవెంట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నట్లుగా దీన్ని నిర్వహించేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. మిస్ వరల్డ్ ఈవెంట్ తో తెలంగాణ స్టామినా ప్రపంచానికి చాటే అవకాశం అవకాశం దొరికింది.

మిస్ వరల్డ్ మెగా బ్యూటీ కాంటెస్ట్ ఓ స్పెషల్ ఈవెంట్. 72వ ఎడిషన్ హైదరాబాద్ లో మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగబోతోంది. మొత్తం 140 దేశాలకు పైగా పోటీదారులు రాబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. విదేశీ అతిథులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క ఈవెంట్ తో తెలంగాణ రాష్ట్రానికి మల్టీ బెనిఫిట్ ఉండేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

వరల్డ్ క్లాస్ ఈవెంట్‌ను నిర్వహించడమే కాదు.. దీన్నుంచి మల్టీ బెనిఫిట్ పొందేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి నెల రోజుల పాటు 140 దేశాల అటెన్షన్ గ్రాబ్ చేసేలా ఈ మెగా ఈవెంట్ ను కండక్ట్ చేయనుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్​ పోటీలకు తెలంగాణను ఎంచుకున్నట్టు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ గతనెలలో ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ గతేడాది ముంబైలో జరిగింది. ఈ సారి కూడా పోటీ గట్టిగానే ఉన్నా.. ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ కు వచ్చేలా చేశారు. మిస్ వరల్డ్ కాంటెస్ట్ ప్రపంచంలోనే చాలా ఓల్డెస్ట్ బ్యూటీ ఈవెంట్. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, ఫిట్ నెస్, సోషియో అవేర్ నెస్, సోషల్ సర్వీస్ లక్ష్యంగా ఇందులో విజేతలు ఎంపికవుతారు.

ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్లు, వారి ప్రతినిధులు, మీడియా సిబ్బంది రాబోతున్నారు. వీరందరికీ తెలంగాణ కల్చర్, హిస్టారికల్ ఇంపార్టెన్స్, టూరిజం ఇంపార్టెన్స్ ను పరిచయం చేయబోతోంది. అంటే నెలరోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్ లో భాగంగా 140 దేశాలకు తెలంగాణ ప్రాధాన్యాన్ని వివరించేలా కార్యక్రమాలు, ట్రిప్స్ ను అరేంజ్ చేసింది. వీరందరినీ బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్ ను ప్రమోట్ చేసేలా ఉపయోగించుకోబోతోంది.

యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. అద్భుతమైన ప్రగతి ప్రయాణంలో ఇదో కీలక ఈవెంట్ గా నిలిచిపోనుంది. అద్భుతమైన కనెక్టివిటీ, వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్ట్, ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, ఐటీ ఇండస్ట్రీ, హెల్త్ హబ్, వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ గా పేరున్న హైదరాబాద్ ను మరో లెవెల్ లో నిలపడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ సేఫ్టీ, స్నేహపూర్వక వాతావరణం వరల్డ్ టూరిస్టులకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చేలా చూసుకుంటున్నారు.

తరవాత కథనం